Wed Mar 18 2026 18:49:48 GMT+0530 (India Standard Time)
‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించిన చంద్రబాబు
ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ లు బస్సులో ప్రయాణించారు.
పదకొండు కిలోమీటర్లు...
ముగ్గురూ దాదాపు పదొకండు కీలోమీటర్లు మేర వీరి ప్రయాణం సాగింది. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. నలభై శాతం ఉన్న వైకల్యం ఉన్న వారికి మాత్రమే కాకుండా వీరితో పాటు సహాయంగా వచ్చే వారికి టిక్కెట్ లో యాభై శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story

