Sat Jan 10 2026 21:55:32 GMT+0000 (Coordinated Universal Time)
12న చంద్రబాబు కీలక భేటీ
ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ నెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. అన్ని శాఖల హెచ్ఓడీలు, సెక్రటరీలు, కలెక్టర్లతో చంద్రబాబు భేటీ కానున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ అంశాలపై చర్చించి పాస్ పుస్తకాల పంపిణీ ఎంత వరకూ జరిగిందన్న దానిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
కలెక్టర్లతో సమావేశం...
ఈ సమావేశానికి అన్ని శాఖల మంత్రులు హాజరుకావాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లతో వర్చువల్ మోడ్ లో సమావేశం జరగనుంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అర్హులకు అందడంపైనా, అలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చంద్రబాబు నాయుడు కలెక్టర్లతో చర్చించనున్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై కూడా ఆరా తీయనున్నారు.
Next Story

