Tue Dec 30 2025 12:13:35 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం
చంద్రబాబు కుప్పంలో మూడోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రధాని భద్రత పై వ్యాఖ్యలు చేశారు

చంద్రబాబు కుప్పంలో మూడోరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు ప్రధాని భద్రత పై వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు సొంత నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయన స్వయంగా వెళ్లి స్థల పరిశీలన జరిపారు. సొంత నివాసం నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. పార్టీ కార్యాలయాన్ని కూడా చంద్రబాబు సందర్శించారు.
ప్రధాని భద్రత విషయంలో....
ప్రధాని మోదీ భద్రత విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్కక్తం చేశారు. ఒక ప్రధాని భద్రత అంటే జాతీయ భద్రతగా అందరం చూడాలని చంద్రబాబు అన్నారు. పంజాబ్ లో జరిగిన ఘటన విచారకరమని అన్నారు. ప్రధాని భద్రత పట్ల జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. కుప్పంలో దళితులపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. పోలీసులు ఒక సామాజికవర్గానికే అండగా నిలిచారన్నారు. టీడీపీ హయాంలో దళితులకు ప్రాధాన్యమిచ్చినట్లు చంద్రబాబు తెలిపారు.
Next Story

