Sat Dec 06 2025 07:30:45 GMT+0000 (Coordinated Universal Time)
బాబు ది అంతా హడావిడే.. ఇక్కడ ఏం జరగలేదు
టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు హడావిడి చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు హడావిడి చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలను రాయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఒక టెండర్ నిబంధనపై నానా యాగీ చేస్తున్నారన్నారు. అది స్థానిక అధికారుల నిర్ణయమని, అది ఎందుకు జరిగిందో తెలుసుకుంటామని అంబటి రాంబాబు తెలిపారు.
డయాఫ్రం వాల్ .....
పోలవరం ప్రాజెక్టుపై నాడు చంద్రబాబు 2018లోనే పూర్తవుతుందని చెప్పారన్నారు. పూర్తయిందా? అని ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారని, రూ.400 కోట్ల తో కట్టిన డయాఫ్రమ్ వాల్ కూలిపోవడానికి మీ తప్పిదం కాదా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. కోనసీమ అల్లర్లలో పవన్ కల్యాణ్ కు ప్రమేయం ఉందన్నారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఇళ్లు తగలబెడితే ఎందుకు ప్రశ్నించలేదున్నారు. తమ బస్సు యాత్రను ప్రశ్నించిన పవన్ కల్యాణ్ మహానాడు గురించి ఎందుకు ప్రశ్నించలేకపోయారని అంబటి రాంబాబు నిలదీశారు.
Next Story

