Fri Dec 05 2025 13:33:38 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు లా అండ్ ఆర్డర్ పై వైట్ పేపర్
గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను, అక్రమాలను బయటపెడుతూ వరసగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు

గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను, అక్రమాలను బయటపెడుతూ వరసగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు శాంతిభద్రతల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడచిన ఐదేళ్లలో శాంతిభద్రతల పరంగా రాష్ట్రంలో వ్యవహరించిన తీరు, అక్రమ కేసులు, నిర్బందకాండ, ప్రతిపక్షాల అణచివేత, పౌరులపై నమోదైన కేసులు తదితర అంశాలపై శ్వేతపత్రం ద్వారా వివరాలు వెల్లడించనున్నారు.
గత ప్రభుత్వంలో...
భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకునేలా గత పాలకులు వ్యవహరించిన తీరు, సాధారణ పౌరుల పైనా కేసులు నమోదు చేసిన వ్యవహారం, ఎస్సీలపై దాడులు, హత్య కేసులు తదితర అంశాలనూ ప్రస్తావించే అవకాశముంది. అమరావతి రైతుల ఉద్యమాన్ని అణచివేసేలా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు, డాక్టర్ సుధాకర్, దళితుడైన డ్రైవర్ సుబ్రమణ్యం, కోడి కత్తి కేసు వ్యవహారంలో గత ప్రభుత్వం వైఖరి, వివేకా హత్యకేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవటం వంటి అంశాలను శ్వేతపత్రంలో ప్రస్తావించనున్నారని సమాచారం.
Next Story

