Wed Dec 17 2025 14:43:32 GMT+0000 (Coordinated Universal Time)
బాబు పర్యటన : యర్రగొండపాలెంలో టెన్షన్
కాసేపట్లో యర్రగొండపాలెంకి చంద్రబాబు వెళుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి దీంతో టెన్షన్ నెలకొంది

యర్రగొండపాలెంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో యర్రగొండపాలెంకి చంద్రబాబు వెళుతుండటంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. చంద్రబాబుని అడ్డుకుంటామని మంత్రి సురేష్, వైసీపీ శ్రేణులు ఇప్పటికే ప్రకటించాయి. సాయంత్రం యర్రగొండపాలెంలో చంద్రబాబు రోడ్ షో జరగనుంది. రాత్రికి యర్రగొండపాలెంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు సభ నిర్వహించనున్నారు.
వైసీపీ నేతలు ఆందోళనకు...
అయితే వైసీపీ నేతలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తతగా మారింది. యర్రగొండపాలెంలో క్యాంప్ ఆఫీసులోనే ఉన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఉన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లకార్డులను వైసీపీ శ్రేణులు సిద్ధం చేయడంతో ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు పర్యటన ఎలా అడ్డుకుంటారో చూస్తామంని తెలుగుదేశం పార్టీ నేతలు సవాల్ విసరుతున్నారు. నల్లచొక్కాలు ధరించిన నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. తనను తగులబెట్టాలంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విడిచి మరీ టీడీపీ శ్రేణులకు సవాల్ విసిరారు.
Next Story

