Fri Dec 05 2025 10:47:24 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పెండింగ్ పెడితే.. చంద్రబాబు రిలీజ్ .. వారికి తీపి కబురే
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన అనేక విషయాలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది

గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన అనేక విషయాలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిలిచిపోయిన నిధులను విడుదల చేస్తుంది. తాజాగా ఏపీలోని క్రీడాకారులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్రీడల్లో వారు సాధించిన ఘనతలకు ప్రకటించిన ప్రోత్సాహకాలను విడుదల చేస్తూ విడుదల చేసింది. అయితే గతంలోనే వారికి ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. గత కొన్నేళ్లుగా ఈ ప్రోత్సాహకాల నిధుల విడుదల పెండింగ్లోనేడు చంద్రబాబు నాయుడు ఆ నిధులను విడుదల చేశారు.
పెండింగ్ లో ఉన్న...
గత ప్రభుత్వ హయాంలో క్రీడాకారులకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన పదకొండ్ల రూపాయల నిధులను తాము విడుదల చేయడానికి చంద్రబాబు అంగీకరించారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రోత్సాహకాలు అందకపోవడంతో క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని 189 మంది క్రీడాకారులకు వెంటనే ఎనిమిది కోట్ల రూపాయల ప్రోత్సహకాలకు సంబంధించిన నగదును విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే మిగిలిన నిధులను కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. మొత్తం 224 మంది క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందాల్సి ఉంది.
Next Story

