Sat Feb 28 2026 19:37:26 GMT+0530 (India Standard Time)
పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ లోని బాణాసంచా పేలుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు

ఆంధ్రప్రదేశ్ లోని బాణాసంచా పేలుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే మంత్రులను, అధికారులను సంఘటన స్థలికివెళ్లి సహాయక చర్యలను చేపట్టాలని కోరారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
సహాయక చర్యలు అందించాలని...
ఎక్స్ లో ఆయన పోస్టు చేస్తూ "కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటన తీవ్ర దిగ్భాంతిని కలిగించింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం విచారకరం. ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడాను. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలని ఆదేశించాను. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాము. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం"మని చంద్రబాబు తెలిపారు.
Next Story

