Wed Mar 18 2026 14:01:59 GMT+0530 (India Standard Time)
TDP : ఎంపీ పుట్టాపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు.. నిర్ణయం ఎప్పుడంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఈరోజు మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో సమావేశమయిన తర్వాత ఈరోజు రేపట్లో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని తెలిసింది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ పై సస్పెన్షన్ వేటు వేయాలని చంద్రబాబు దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మహేశ్ వ్యవహారంతో పార్టీతో పాటు ప్రభుత్వం కూడా రాజకీయంగా ఇబ్బందులు పడుతుందని, విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం.
పార్టీ మోయాల్సిన అవసరం లేదని...
నిన్న తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ డ్రగ్స్ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేస్తూ, దురలవాట్లతో నష్టం చేసేవారిని పార్టీ మోయాల్సిన అవసరం లేదని, యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో మహేశ్ యాదవ్కు సీటు ఇచ్చినా, ఎంపీగా ఉండి అలాంటి పార్టీలకు వెళ్లడం తప్పని, వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడంతోపుట్టా మహేశ్ పై సస్పెన్షన్ విధించనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది.
వేటు వేయకుంటే...
మరొకసారి కూటమి అధికారంలోకి రావాలంటే సస్పెన్షన్ వేటు వేయడం మంచిదని చంద్రబాబు భావిస్తున్నారు. వేటు వేయకపోతే పార్టీ నేతల్లోనూ మరింత అలుసుగా మారే అవకాశముందని చంద్రబాబు భావిస్తున్నారు. మిగిలిన ఆరోపణలకు, డ్రగ్స్ పై వచ్చే ఆరోపణలకు చాలా తేడా ఉందని ఇప్పటికే చంద్రబాబు సీనియర్ నేతల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీని వల్ల టీడీపీతో పాటు కూటమి కూడా రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనకుండా సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పుట్టా మహేశ్ కు ఇప్పటికే పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చింది.
గడువు ముగిసిన తర్వాత...
ఐదు రోజుల గడువు ఇచ్చింది. ఈ గడువు పూర్తయిన తర్వాత ఆయన నుంచి సమాధానం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరొకవైపు పుట్టా మహేశ్ కూడా తాను ఈ కేసులో బెయిల్ పై వచ్చిన తర్వాత రెండుసార్లు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానని, అందులో డ్రగ్స్ మూలాలు లేవని తేలిందని చెబుతున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడంతో సస్పెన్షన్ వేటు వేయడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది. పుట్టా మహేశ్ వ్యాపార లావాదేవీలపై కూడా పెద్దయెత్తున చర్చ జరుగుతుండటంతో పాటు టీడీపీ అనుకూల మీడియాలో కూడా వ్యతిరేక కథనాలు రావడంతో చంద్రబాబు చర్యకు సిద్ధమయినట్లు తెలిసింది.
Next Story

