Mon Jan 19 2026 13:48:35 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేటి నుంచి దావోస్ లో చంద్రబాబు
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ కు చేరుకున్నారు

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ కు చేరుకున్నారు. మంత్రి నారా లోకేశ్ అధికారుల బృందం బయలుదేరి వెళ్లింది. జనవరి 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 4 రోజుల పాటు చంద్రబాబు దావోస్‌లో 36 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, అధికారుల బృందం దావోస్ బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనున్న చంద్రబాబు మధ్యాహ్నం 2.30 గంటలకు జ్యూరిచ్‌లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాద పూర్వక భేటీ కానున్నారు.
వివిధ పారిశ్రామికవేత్తలతో...
అనంతరం సీఎంతో సమావేశం కానున్న ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్ తోనూ సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో తెలుగువారిని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించనున్నారు. డయాస్పోరా సమావేశం అనంతరం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్‌కు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో ముఖ్యమంత్రి భేటీ కానున్నారు.
Next Story

