Fri Dec 05 2025 23:51:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నేడు నెల్లూరు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మైపాడు గేట్ సెంటర్ లో ప్రారంభించాల్సిన స్మార్ట్ స్ట్రీట్ ప్రోగ్రాం రద్దయింది. దీంతో ఈదగాలిలో విశ్వ సముద్ర బయో ఎథనాల్ ప్లాంట్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
వేదిక మార్పు...
వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అధికారులు వేదికను మార్పు చేశారు. మరికొన్ని అభివృద్ధి పనులను పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక నేతలతో మాట్లాడతారు. ఈరోజు మధ్యాహ్నం మంత్రి వర్గ సమావేశం పూర్తయిన వెంటనే నెల్లూరు జిల్లాకు వెళ్లి ఎథనాల్ ప్లాంట్ ను ప్రారంభించిన అనంతరం నందగోకులం లైఫ్ స్కూల్ ను ప్రారంభించనున్నారు.
Next Story

