Tue Feb 17 2026 15:49:10 GMT+0530 (India Standard Time)
Chandrababu : షాను కలసి వచ్చిన తర్వాత చంద్రబాబులో ఈ మార్పు హేమిటో?
ఢిల్లీ పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు కనిపిస్తుంది.

ఢిల్లీ పర్యటన తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి వచ్చిన తర్వాత ఆయన స్వరం మారినట్లు కనిపిస్తుంది. తిరుమల లడ్డూ వివాదానాకి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. అంతకు ముందు రాష్ట్రంలో కూటమి నేతలందరూ ఏకమై సమావేశమై తిరుమల లడ్డూ వివాదంపై చర్చించారు. తిరుమల లడ్డూలో స్వామి వారిని అపవిత్రం చేసిన విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఏ విషయంలో రెండేళ్లుగా కలసి కూర్చుని మాట్లాడుకోని కూటమి నేతలు తిరుమల లడ్డూ విషయంలో అత్యవసర సమావేశమై దానిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. మీడియా సమావేశంలో మూడు పార్టీల నేతలు మాట్లాడారు.
గత కొన్ని రోజులుగా ...
అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచి ఆయన తిరుమల లడ్డూ విషయంలో దూరంగా ఉండాలని భావించుకున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా లడ్డూనే రాజకీయ అస్త్రంగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత అనూహ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆ అంశానికి దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. ఈనెల 10న ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా సమావేశమైన చంద్రబాబు లడ్డూ విషయంపై కూడా చర్చించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షాతో సుమారు గంటపాటు జరిగిన చర్చలో శ్రీవారి లడ్డూ విషయంలో అతి చేయడం సరికాదని బీజేపీ పెద్దలు హితవు పలికినట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.
ఇబ్బందులంటూ...
సుప్రీం కోర్టు ఆదేశాలతో, కోర్టు నేతృత్వంలో ఏర్పాటైన సీబీఐ సిట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వాల్సింది పోయి దాన్ని ధిక్కరించేలా, తప్పుపట్టేలా వ్యవహరించడం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మర్యాదకరం కాదని, రాజ్యాంగ సంక్షోభాలకు ఇలాంటి అంశాలు దారి తీస్తాయని, దీనిపై ఒకవేళ సుప్రీంకోర్టు విచారణ చేస్తే.. అభాసుపాలు కాక తప్పదని చంద్రబాబుకు కేంద్ర పెద్దలు హితవు పలికినట్టుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని కారణాలు కూడా తిరుమల లడ్డూ వ్యవహారంలో ఇక దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇకపై తిరుమల లడ్డూ అంశాన్ని తాను ప్రస్తావించనని అసెంబ్లీలో చంద్రబాబు అన్నారంటే ఇది హస్తిన పర్యటనే కారణమన్న అభిప్రాయం కూటమి నేతల్లో కలుగుతుంది.
Next Story

