Fri Dec 05 2025 10:27:29 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు
ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం చంద్రబాబు తొలిసారి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు

ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం చంద్రబాబు తొలిసారి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. చంద్రబాబుకు ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికారు. ప్రతి శనివారం ఇకపై పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీకి దూరం కాకూడదన్న ఉద్దేశ్యంతో ప్రతి శనివారం కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.
చంద్రబాబుతో పాటు...
చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా శనివారం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. తమ వ్యక్తిగత సమస్యలతో పాటు నియోజకవర్గ సమస్యలను కూడా వారి దృష్టిికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ప్రభుత్వం, పార్టీని సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పార్టీ నేతలతో పాటు కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు.
Next Story

