Mon Mar 23 2026 16:33:04 GMT+0530 (India Standard Time)
Breaking : నరసరావుపేట సభ రద్దు.. రీజన్ ఇదే
నరసరావుపేటలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభ రద్దయింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు.

నరసరావుపేటలో చంద్రబాబు సభ రద్దయింది. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. వనమహోత్సవం కార్యక్రమం సందర్భంగా ఈరోజు నరసరావుపేటలోని జేఎన్టీయూ గ్రౌండ్స్ లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు పాల్గొన్నాల్సి ఉంది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొని ప్రసంగించాల్సి ఉంది.
వర్షం కారణంగా...
కానీ భారీ వర్షాల కారణంగా చంద్రబాబు సభను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సభ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వర్షాలు పడుతుండటంతో సభ రద్దు కావడంతో టీడీపీ శ్రేణులు నిరాశ చెందాయి. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ సభ కోసం ఎదురు చూస్తున్న దశలో రద్దు కావడంతో ఒకింత నిరాశకు లోనయ్యారు.
Next Story

