Thu Jul 07 2022 07:35:34 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పం ఘటనపై చంద్రబాబు సీరియస్ !

చిత్తూరు : కుప్పంలో గత అర్థరాత్రి ఓ హోటల్ పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసిన ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థరాత్రి హోటల్ కు వచ్చి భోజనం కోసం వచ్చి.. దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు. ''కుప్పంలో హోటల్ పై వైసిపి కౌన్సిలర్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. కుప్పంలో ఎప్పుడూ లేని దాడుల సంస్కృతిని వైసిపి తీసుకురావడం దురదృష్టకరం. భోజనం అయిపోయిందన్న పాపానికి స్థానిక హోటల్ పై వైసిపి ప్రజా ప్రతినిధులు దాడి చెయ్యడం దారుణం.''
''ఫర్నిచర్ ధ్వంసం చేసి,మహిళలను బెదిరించడం పై పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలి.హోటల్ నిర్వాహకులను చంపేస్తాం...హోటల్ తగలబెడతాం అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కఠిన చర్యలతో క్రిమినల్స్ యాక్టివిటీకి ముగింపు పలకాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.బాధిత కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుంది.'' అని ట్వీట్ చేశారు.
Next Story