Mon Feb 02 2026 07:48:37 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలో ఓటమి దిశగా టీడీపీ
కుప్పంలో చంద్రబాబుకు ఘోర పరాజయం దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది.

కుప్పంలో చంద్రబాబుకు ఘోర పరాజయం దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ వైసీపీ క్లీన్ స్వీప్ దిశగానే విజయాలు నమోదు చేస్తుంది. 29 వార్డులున్న కుప్పంలో ఇప్పటికే వైసీపీ 13 వార్డుల్లో గెలిచింది. మరో రెండు వార్డులు చేజిక్కించుకుంటే మున్సిపల్ ఛైర్మన్ పదవి వైసీపీకి దక్కుతుంది.
ఇప్పటికే 13 వార్డులు...
29 వార్డులున్న కుప్పంలో ఇప్పటి వరకూ టీడీపీ రెండు వార్డుల్లోనే విజయం సాధించింది. 5, 11 వార్డుల్లోనే టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 11 వార్డులో టీడీపీ గెలిచినప్పటికీ వైసీపీ నేతలు రీకౌంటింగ్ కు కోరడంతో తిరిగి లెక్కిస్తున్నారు. వైసీపీ కుప్పంలో 1,2,3,4,6,7,8,9,10,12,13,15 వార్డులను చేజిక్కించుకుంది.
Next Story

