Mon Mar 16 2026 01:09:42 GMT+0530 (India Standard Time)
టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు
టీటీడీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకి తీసుకెళ్లేందుకు చాగంటిని సలహాదారుగా నియమించామని..

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. చాగంటి కోటేశ్వరరావుని సలహాదారుగా నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
టీటీడీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకి తీసుకెళ్లేందుకు చాగంటిని సలహాదారుగా నియమించామని పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నిన్న ఎస్వీబీసీ, హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మప్రచారం కార్యక్రమాలను స్థానిక యువత భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
Next Story

