Mon Dec 08 2025 12:15:12 GMT+0000 (Coordinated Universal Time)
పదవిపై చాగంటి విముఖత
ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వం ఇచ్చిన పదవిని సున్నితంగా తిరస్కరించారు

ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వం ఇచ్చిన పదవిని సున్నితంగా తిరస్కరించారు. చాగంటి కోటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుడిగా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదవిని తీసుకునేందుకు చాగంటి ఇష్టపడలేదు.
పదవులు అవసరం లేదన్న...
తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి తనకు పదవులు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తన ఊపిరే వెంకటేశ్వరస్వామి అని, టీటీడీకి అవసరం ఉన్నప్పుడు తాను తప్పకుండా సలహాలిచ్చేందుకు ముందుంటానని ఆయన పేర్కొన్నారు.
Next Story

