Thu Mar 19 2026 05:33:45 GMT+0530 (India Standard Time)
పోలవరంలో కేంద్రబృందం పర్యటన
పోలవరంలో కేంద్ర బృందం పర్యటించనుంది.మూడు రోజుల పాటు పోలవరం ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలియజేయనున్నారు

పోలవరంలో నేటి నుంచి కేంద్ర బృందం పర్యటించనుంది. నేటి నుంచి మూడు రోజుల పాటు పోలవరం ప్రాంతంలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలియజేయనున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పై జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ బృందం పర్యటిస్తున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకూ పోలవరం నిర్వాసితులకు ఎంత మొత్తం చెల్లించారు? ఎవరికి చెల్లించారు? ఇంకా ఎంతమొత్తం చెల్లించాలి అన్న దానిపై కేంద్ర బృందం పరిశీలించనుంది.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీపై...
ఇటీవల వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే పరిహారం ఉందని చెప్పారు. 20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని, రెండు, మూడు వేల కోట్లు అయితే తాను చెల్లించేవాడినని చెప్పడంతో కేంద్ర బృందం ప్రత్యేకంగా పరిశీలన జరపనుంది. దీంతో పాటు వరద నష్టంపై అంచనా వేయడానికి కూడా కేంద్ర బృందాలు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నాయి.
Next Story

