Sat Dec 13 2025 22:43:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. ఇటీవల సంభవించిన మోంథా తుపాను కు సంభవించిన నష్టాలను పరిశీలించనుంది

ఆంధ్రప్రదేశ్ లో నేడు కేంద్ర బృందం పర్యటించనుంది. ఇటీవల సంభవించిన మోంథా తుపాను కు సంభవించిన నష్టాలను పరిశీలించనుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రధానంగా పంటనష్టంతో పాటు రోడ్లు, భవనాలను వంటివి ఈ బృందం పరిశీలించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొంథా తుపాను వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. 5,760 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రానికి పంపిన నివేదికలో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
ఏడుగురు సభ్యులతో కూడిన...
ఈ నివేదిక మేరకు నష్టం అంచనాను తెలుసుకునేందుకు కేంద్ర బృందం నేటి నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనుంది. అధికారులతో సమావేశం కానుంది. తుపాను ప్రభావం, నష్టం, పునరుద్ధరణపై చర్చించనుంది. కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి నేతృత్వంలో ఈ బృందం పర్యటించనుంది. ఇందుకోసం రాష్ట్ర అధికారులు తుపాను ప్రభావంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
Next Story

