Thu Mar 19 2026 07:21:49 GMT+0530 (India Standard Time)
జులై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి గన్నవరం ఎయిర్పోర్టు
గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకోనుంది

గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తీసుకోనుంది. తాజాగా ఎయిర్పోర్టు అథారిటీ.. డీజీపీకి లేఖ రాసింది. జులై 2వ తేదీ నుంచి సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి విమానాశ్రయం భద్రత వెళ్తుందని డీజీపీకి రాసిన లేఖలో ఎయిర్ పోర్టు అథారిటీ పేర్కొంది
విధులు నిర్వహిస్తున్న...
అయితే జులై రెండో తేదీ నుంచి గన్నవరం విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ విభాగాన్ని వెనక్కు తీసుకోవాలని కోరింది. సీఐఎస్ఎఫ్ ఆధీనంలోకి వచ్చిన వెంటనే అక్కడ భద్రతా విధుల్లో ఉన్న రాష్ట్ర ఎస్పీఎఫ్ విభాగాన్ని ఉపసంహరించాలని ఎయిర్ పోర్టు అధారిటీ డీజీపీకి రాసి లేఖలో స్పష్టం చేసింది.
Next Story

