Fri Dec 05 2025 15:54:15 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ ఎంపీ లావుకు కేంద్రం కీలక పదవి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది

రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఎఫ్.సి.ఐ కమిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ను నియమించడం పట్ల టీడీపీ శ్రేణులు. హర్షం వ్యక్తం చేశాయి
ఎఫ్.సి.ఐ ఛైర్మన్ గా...
ఎఫ్.సి.ఐ కమిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రంలో పర్యటించి,ఆహార,ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు,ఆహార పదార్థాలు నాణ్యత తో సహా,పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ఎఫ్.సి.ఐ కమిటీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి,ప్రధాని మోదీ కి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story

