Sun Mar 08 2026 01:47:51 GMT+0530 (India Standard Time)
కేంద్రం కీలక నిర్ణయం : అరుదైన గౌరవం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖకు అరుదైన గౌరవం దక్కింది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖకు అరుదైన గౌరవం దక్కింది. నీతి అయోగ్ గ్రోత్ హబ్స్ గా నాలుగు నగరాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో విశాఖ ఒకటి. మిగిలినవి సూరత్, వారణాసి, ముంబయి నగరాలను గ్రోత్ హబ్స్ గా గుర్తించింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశాఖపట్నం నగరాన్ని ఎంపిక చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
పైలెట్ ప్రాజెక్టు కింద...
పైలట్ ప్రాజెక్ట్‌ల కింద నాలుగు నగరాలను ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గ్రోత్ హబ్స్ గా విశాఖను ఎంపిక చేయడంతో మరింత అభివృద్ధి జరుగుతుందని నగరవాసులతో పాటు ఏపీ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Next Story

