Thu Dec 18 2025 07:26:18 GMT+0000 (Coordinated Universal Time)
స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం విధానమిదే
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను మానుకోలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచనను మానుకోలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపలేదని మరోమారు స్పష్టం చేసింది. ప్రయివేటీకరణను నిలిపేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టి పారేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రయివేటీకరణ ఆపబోం...
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకరాంతో ఉపసంహరణ ప్రక్రియ నడుస్తుందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఎలాంటి ప్రతిష్టంభన లేదని, ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపర్చడానికి మాత్రం పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Next Story

