Sat Dec 06 2025 00:47:28 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబుకు మరింత భద్రత పెంపు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచింది. నిన్న కుప్పంలో జరిగిన ఘటనతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. ఇప్పటికే చంద్రబాబు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్నారు. ఆయనకు 12 +12 కమాండాలతో భద్రతను కల్పిస్తూ ఎన్ఎస్జీ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ....
నిన్ననే ఎన్ఎస్జీ డీజీ చంద్రబాబు ఇంటితో పాటు పార్టీ కార్యాలయంలోని ప్రతి గదిని పరిశీలించారు. అనంతరం ఆయన చంద్రబాబుకు భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉన్నారు. ఉద్రిక్తతల మధ్య ఆయన పర్యటన కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు ప్రాణాలకు హాని ఉందని కేంద్రానికి లేఖలు రాయడంతో ఈ చర్యలు తీసుకుంది.
Next Story

