Thu Mar 19 2026 07:05:56 GMT+0530 (India Standard Time)
ఏపీకి షాకిచ్చిన కేంద్రం.. ఆ నిధులు వెనక్కు?
పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీకి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి ఇచ్చిన 320 కోట్ల రూపాయలను వెనక్కు తీసుకుంది

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రానికి ఇచ్చిన 320 కోట్ల రూపాయలను వెనక్కు తీసుకుంది. పనులు చేయకపోవడం కారణంగా కేంద్రం నిధులను వెనక్కు తీసుకుంది. పనులు చేయకపోవడం వల్లనే రీఎంబర్స్ మెంట్ సొమ్ము వెనక్కు తీసుకున్నట్లు తెలిపింది.
వారం క్రితమే....
వారం రోజుల క్రితమే 320 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించింది. పనులు పూర్తి చేసినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా కేంద్రానికి నివేదిక పంపంది. అయితే పనులు పూర్తి చేయకుండానే తప్పుడు నివేదికలను పంపారని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను వెనక్కు తీసుకుంది.
Next Story

