Fri Dec 05 2025 11:32:51 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool : కర్నూలు వాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానంగా కర్నూలు వాసులకు తీపికబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ లో మరో పైలెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పైలట్ శిక్షణ సంస్థ కర్నూలుకు వస్తే ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు మరింతగా ఆ ప్రాంతానికి చెందిన యువతకు అవకాశం దక్కుంది.
పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు...
ఏపీలో మరో పైలట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటు చేయాలని అనుమతించింది. ఓర్వకల్లులోని విమానాశ్రయంలో ఈ పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు వాసులకు ఈ పైలెట్ శిక్షణ కేంద్రం రావడంతో మరిన్ని అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ ను ఏపీఏడీసీఎల్ ఎంపిక చేయనుంది.
Next Story

