Sat Dec 06 2025 01:14:34 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలిపింది

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. కేంద్ర మంత్రి వర్గం దీనికి ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వెల్లడించారు. కొత్త జోన్ ఏర్పాటు డీపీఆర్ పై వచ్చిన సూచనల పరిశీలనకు సీనియర్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు రైల్వే మంత్రి తెలిపారు.
మంత్రివర్గం ఆమోదం....
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ను, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. కొత్త రైల్వే జోన్ , రాయగడ డివిజన్ కోసం బడ్జెట్ లో 170 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి భూమిని కూడా ఎంపిక చేశామని చెప్పారు.
Next Story

