Sat Jan 10 2026 21:51:39 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డబ్బులు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులను వచ్చే నెలలో విడుదల చేయనుంది. 22వ పీఎం కిసాన్ సమ్మాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రైతుల ఖాాతాల్లో...
వచ్చే నెలలో అర్హులైన రైతుల ఖాతాల జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయల నగదుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడుల కోసం ఏడాదిలో మూడు సార్లు పెట్టుబడులకు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయనుంది.
Next Story

