Fri Mar 20 2026 02:02:04 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొత్త వైద్య కళాశాలలకు సంబంధించి అదనపు సీట్లను మంజూరు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏపీలో దాదాపు ముప్ఫయి ఆరు వైద్య విద్యకు సంబంధించి పీజీ సీట్లు అదనంగా రానున్నాయి. ఇది పీజీ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
కొత్త వైద్య కళాశాలలకు...
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 36 పీజీ సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. వీటిలో ఏలూరు వైద్య కళాశాలకు 12, విజయనగరం, మచిలీపట్నం వైద్య కళాశాలలకు ఎనిమిది చొప్పున, రాజమహేంద్రవరం, నంద్యాల వైద్య కళాశాలలకు నాలుగు సీట్ల చొప్పున కేటాయించింది. దీంతో రెండు విడతల్లో కొత్తగా కేటాయించిన సీట్ల సంఖ్య 90కి చేరింది.
Next Story

