Thu Dec 18 2025 13:38:21 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సీబీఐ ఎదుటకు ఎంపీ అవినాష్ రెడ్డి
కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నేడు మరోసారి ప్రశ్నించనున్నారు

కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నేడు మరోసారి ప్రశ్నించనున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలను సంపాదించిన సీబీఐ అధికారులు ఈరోజు అవినాష్ రెడ్డిని అనేక అంశాలపై ప్రశ్నించే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే ఒకసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
మరోసారి ప్రశ్నించేందుకు...
ఈ నేపథ్యంలో మరోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయిన నేపథ్యంలో నేటి విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
- Tags
- avinash reddy
- cbi
Next Story

