Mon Mar 16 2026 10:34:20 GMT+0530 (India Standard Time)
అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ
హైదరాబాదులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు వెళ్లారు

హైదరాబాదులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు వెళ్లారు. వైఎస్ వివేకా మృతి కేసులో ఆయనను విచారిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పులివెందులలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.
హత్య కేసులో...
ఈ నేపథ్యంలో ఈ కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారా? అన్న ఉత్కంఠ ఆయన అనుచరులు, అభిమానుల్లో నెలకొని ఉంది. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లకు పైగానే సీబీఐ అధికారులు ఈ కేసు విషయమై ప్రశ్నించారు. హత్య కేసుకు సంబంధించిన ఆధారాలను చెరిపేశారన్న అభియోగం వైఎస్ అవినాష్‌పైన కూడా ఉంది.
Next Story

