Mon Mar 16 2026 12:31:28 GMT+0530 (India Standard Time)
మళ్లీ హత్య కేసు విచారణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మరోసారి విచారణను ప్రారంభించారు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు మరోసారి విచారణను ప్రారంభించారు. నిన్నటి నుంచి తిరిగి విచారణను ప్రారంభించారు. కడప కేంద్ర కారాగారంలో సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. పులివెందులకు చెందిన భరత్ యాదవ్ ను విచారించినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే మరికొన్ని ఆరోపణలు కూడా విన్పించాయి.
నిన్నటి నుంచి....
హత్యకు గల కారణాలు, హత్యకు ప్లాన్ చేసింది ఎవరు? హత్య చేసింది ఎవరు తదితర అంశాలను సీబీఐ అధికారులు ఛార్జిషీటు రూపంలో వేశారు. అయితే నిందితులు మాత్రం తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సీబీఐ అధికారులు విచారణను ప్రారంభించడం చర్చనీయాంశమైంది. నిన్న విచారించిన భరత్ యాదవ్ ఈ కేసులో అరెస్ట్ అయిన సునీల్ యాదవ్ కు బంధువు.
Next Story

