Wed Feb 08 2023 07:13:32 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 28న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని పేర్కొంది

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 28న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వచ్చి విచారణలో పాల్గొనాలని సీబీఐ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ నెల 28న ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీీబీఐ దర్యాప్తును వేగం పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగానే అవినాష్ రెడ్డని నిన్ననే హాజరు కావాలని సీబీఐ కోరింది. అయితే తాను ముందుగా ఫిక్స్ చేసుకున్న కార్యక్రమాల వల్ల విచారణకు రాలేకపోతున్నానని, ఐదు రోజుల తర్వాత విచారణకు హాజరవుతానని, పూర్తిగా సహకరిస్తానని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీంతో రెండోసారి సీబీఐ అవినాష్ కు నోటీసులు ఇచ్చింది.
Next Story