Sun Mar 15 2026 12:45:44 GMT+0530 (India Standard Time)
ఎంపీ తండ్రికి సీబీఐ నోటీసులు
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసింది. వివేకాందరెడ్డి హత్య కేసులో భాస్కర్ రెడ్డిని విచారించేందుకు సీబీఐ ఈనోటీసులు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
హాజరు కాలేనని...
అయితే తాను 23వ తేదీన విచారణకు హాజరు కాలేనని భాస్కర్ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరో తేదీని సూచించాలని ఆయన పేర్కొన్నారు. దీంతో మరో తేదీతో తిరిగి సీబీఐ నోటీసులను సీబీఐ అధికారులు ఇవ్వనున్నారు. సీబీఐ అధికారులు ఇప్పటికే వైఎస్ అవినాష్ రెడ్డిని రెండోసారి విచారణకు హాజరు కావాలటూ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
- Tags
- cbi
- bhaskar reddy
Next Story

