Wed Mar 18 2026 22:25:52 GMT+0530 (India Standard Time)
జగన్ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా
వచ్చేనెలలో తనకు లండన్ కు వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ అనుమతించాలని వేసిన పిటీషన్ పై సీబీఐ న్యాయస్థానం విచారణ జరిపింది

వచ్చేనెలలో తనకు లండన్ కు వెళ్లేందుకు మాజీ సీఎం జగన్ అనుమతించాలని వేసిన పిటీషన్ పై సీబీఐ న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే పిటిషన్పై విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది. సెప్టెంబరు నెలలో తాను యూకేలో పర్యటించేందుకు వెళ్లాలని ఇందుకు అనుమతించాలని సీబీఐ న్యాయస్థానాన్ని జగన్ కోరారు.
యూకేకు వెళ్లేందుకు...
యూకేలో తన కుమార్తె చదువుతుందని, ఆమెను చూసేందుకు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. అయితే సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఏటా జగన్ యూకే వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో కలసి కొన్ని రోజులు గడిపి వస్తారు.
Next Story

