Fri Mar 20 2026 16:17:45 GMT+0530 (India Standard Time)
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులవివక్ష
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల పట్ల కులవివక్ష సంచలనంగా మారింది

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల పట్ల కులవివక్ష సంచలనంగా మారింది. మృతి చెందిన వారి భౌతిక దేహాన్ని కూడా ఆ వీధి నుంచి తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. దీంతో అగ్రవర్ణాలు, దళితుల మధ్య కొంత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మృతదేహాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ అడ్డుకున్న అగ్రవర్ణాల వ్యక్తులు.. పంట పొలాల్లోంచి తీసుకెళ్లాలంటూ హెచ్చరించారు.
అంతిమ యాత్రపై...
అంతిమయాత్రపై రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్తత నెలకొంది. పి.గన్నవరం మండలం కందాలపల్లిలో నాలుగు రోజుల కిందట ఈ ఘటన జరిగింది. దళిత సంఘాల ఆందోళనలతో 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగడం ఘోరమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. కులవివక్షకు పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Next Story

