Wed Mar 18 2026 11:01:05 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేటి నుంచి జగన్ కేసులు విచారణ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసులు నేటి నుంచి విచారణకు రానున్నాయి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసులు నేటి నుంచి విచారణకు రానున్నాయి. హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో నేటి నుంచి విచారణ జరగనుంది. వాస్తవానికి నిన్నటి నుంచే జగన్ కేసులు విచారణ ప్రారంభం కావాల్సి ఉండగా, సీబీఐ న్యాయస్థానం న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నేటికి కేసుల విచారణ వాయిదా పడింది.
సీబీఐ, ఈడీ కేసులు..
దీంతో నేటి నుంచి వైఎస్ జగన్ కేసులు విచారణను సీబీఐ కోర్టు చేపట్టనుంది. ప్రతి రోజూ విచారణ చేయనుంది. మొత్తం పదకొండు సీబీఐ కేసులపై ఈ కోర్టు విచారణ చేపట్టనుందని న్యాయవాదులు తెలిపారు. అదే సందర్భంగా వైఎస్ జగన్ పై నమోదు చేసిన తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులపై కూడా నేటి నుంచి విచారణ జరగనుంది.
Next Story

