Fri Mar 20 2026 15:05:14 GMT+0530 (India Standard Time)
Corona Virus : కొంచెం రిలీఫ్.. ఈరోజు కేసులు ఎన్నంటే?
భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులతో పోలిస్తే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి

భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులతో పోలిస్తే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో భారత్ లో 412 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా గడచిన ఇరవై నాలుగు గంటల్లో ముగ్గురు మరణించారు.
ఏపీలోనూ అత్యధికంగా...
అత్యధికంగా ఈసారి కూడా కేరళలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 4,170 కరోనా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో పది, ఆంధ్రప్రదేశ్ లో 29 గడిచిన ఇరవై నాలుగు గంటల్లో నమోదు కావడం విశేషం. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి మాస్క్లు ధరిస్తూ భౌతిక దూరాన్ని పాటించాలని కోరుతున్నారు.
Next Story

