Thu Jan 29 2026 01:16:14 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : విశాఖ వైసీపీ నేతలకు వరస నోటీసులు.. ఉక్కపోతతో లీడర్లు
ప్రభుత్వం మారడంతో కేసుల నమోదు కావడంతో పాటు అక్రమాల నిర్మాణాలపై విశాఖ వైసీపీ నేతలు వరసగా నోటీసులు అందుకుంటున్నారు.

విశాఖపట్నంలో వైసీపీ నేతలు ఉక్కపోతను ఎదుర్కుంటున్నారు. ప్రభుత్వం మారడంతో కేసుల నమోదు కావడంతో పాటు అక్రమాల నిర్మాణాలపై వైసీపీ నేతలు వరసగా నోటీసులు అందుకుంటున్నారు. వైసీపీకి చెందిన హయగ్రీవ భూముల వ్యవహారంలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై పోలీసు కేసు నమోదయింది. ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
కమర్షియల్ కాంప్లెక్స్ లను...
ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ కు చెందిన కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం అనుమతులు లేకుండా జరిగాయని మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే భవన నిర్మాణం పై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. గాజువాక ప్రాంతంలో మాజీ మంత్రి అమర్నాధ్ నాలుగు అంతస్థుల కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించిన నోటీసులు అధికారులు ఆయనకు అందచేశారు.
Next Story

