Wed Jul 09 2025 18:21:21 GMT+0000 (Coordinated Universal Time)
గుంటూరు ఘటనపై కేసు నమోదు
గుంటూరులో తెలుగుదేశం పార్టీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు

గుంటూరులో తెలుగుదేశం పార్టీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరణాలకు నిర్వాహకుల వైఖరే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
304 సెక్షన్ కింద...
ఉయ్యూరు ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు సరైన ఏర్పాట్లు చేయకుండా మహిళలను అధిక సంఖ్యలో తీసుకురావడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఉయ్యూరు ట్రస్ట్ నిర్వాహకుడు శ్రీనివాసరావుపై 304 సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story