Fri Sep 13 2024 02:40:08 GMT+0000 (Coordinated Universal Time)
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదయింది
తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదయింది. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం పై కేసు నమోదు చేసినట్లు తిరుపతి ఈస్ట్ పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపులకు...
లైంగిక వేధింపులకు గురి చేస్తూ, శారీరకంగా అనుభవిస్తూ, తనపై మూడు సార్లు కోనేటి ఆదిమూలం అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు
చేశారు. తిరుపతిలోని భీమాస్ పారడైజ్ రూమ్ నంబర్ 105, 109 లో తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. పుటేజీ ని పోలీసులు సేకరించారు. అయితే కోనేటి ఆదిమూలం మాత్రం అది మార్ఫింగ్ వీడియో అని చెబుతున్నారు. తనపై కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.
Next Story