Tue Jan 20 2026 10:20:35 GMT+0000 (Coordinated Universal Time)
Attack On Ys Jagan : దుర్గారావు చెబితేనే రాయితో జగన్ ను కొట్టా పోలీసుల విచారణలో సతీష్
జగన్ పై రాయి దాడి కేసులో సింగ్ నగర్ కు చెందిన సతీష్ , దుర్గారావులపై కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

జగన్ పై దాడి కేసులో ఇద్దరి పై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. సింగ్ నగర్ కు చెందిన సతీష్ ను ఏ1 గా, దుర్గారావును ఏ2 గా కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే దుర్గారావు సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ నేతగా కొనసాగుతున్నారని సతీష్ ను విచారించడం ద్వారా వెల్లడయిందని చెబుతున్నారు.
టీడీపీ నేత దుర్గారావు...
దుర్గారావు చెబితేనే సతీష్ రాయితో జగన్ పై దాడికి పాల్పడ్డారని తెలియడంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి కేసులో ఐదుగురు నిందితులుగా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన ముగ్గురి చేత స్టేట్మెంట్ రికార్డు చేయించుకుని వదిలేస్తారని చెబుతున్నారు. నేడు పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చూపంించనున్నారు.
Next Story

