Fri Dec 05 2025 15:41:26 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఉప ముఖ్యమంత్రి పై కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదయింది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదయింది. కడప గౌస్ నగర్ లో జరిగిన అల్లర్ల ఘటనలో టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లతో పాటు ఘర్షణలు జరిగే అవకాశముండటంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కొందరిపై కేసులు నమోదు చేస్తున్నారు.
అలర్ల ఘటనలో...
ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో పాటు ఇరవై ఒక్క మంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అదే విధంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డితో పాటు 24 మంది టీడీపీ కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Next Story

