Fri Dec 05 2025 09:30:16 GMT+0000 (Coordinated Universal Time)
నటి శ్రీరెడ్డిపై అసభ్యకర వీడియోల కేసు: తూర్పు గోదావరి జిల్లాలో FIR
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంపై అసభ్యకర వీడియోలపై నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు, సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్‌లపై FIR.

నటి శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా వీడియోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు అందడంతో ఈ కేసు నమోదైంది. మోరంపూడికి చెందిన టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి మజ్జి పద్మావతి రాజమహేంద్రవరం గ్రామీణంలోని బొమ్మూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత గౌరవానికి భంగం కలిగేలా కూడా వీడియోలు పెట్టారని ఆరోపించారు.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే వ్యక్తులపై కేసులు బుక్ చేయడంలో తప్పు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అభిప్రాయపడింది. పోలా విజయ్‌బాబు దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తులపై కేసులు పెట్టకుండా పోలీసులను అడ్డుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. పోలీసు కేసులపై అభ్యంతరం వ్యక్తం చేసేవారు క్వాష్ పిటిషన్లు వేయవచ్చని కోర్టు పేర్కొంది.
Next Story

