Fri Dec 05 2025 11:28:30 GMT+0000 (Coordinated Universal Time)
అంబటి రాంబాబుపై కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం గుంటూరులో వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమం సందర్భంగా అంబటి, తమ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఆయనను పోలీసులు టీజేపీఎస్ కళాశాల వద్ద అడ్డుకున్నారు. దీంతో సీరియస్ అయిన అంబటి రాంబాబు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సీఐ వెంకటేశర్లుతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తమ విధులకు ఆటంకం కలిగించారని అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా కొంతమంది వైసీపీ నేతలపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

