Thu Mar 19 2026 05:49:05 GMT+0530 (India Standard Time)
ఏడో రోజు అమరావతి రైతుల పాదయాత్ర
రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతుంది.

రాజధాని అమరావతి రైతుల మహాపాదయాత్ర బాపట్ల జిల్లాలో కొనసాగుతుంది. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. నగరం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమయింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వెళుతున్న ఈ పాదయాత్ర వద్దకు ప్రజలు పెద్దయెత్తున చేరుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన మహా పాదయాత్ర ప్రారంభమయింది.
రెండు నెలల పాటు...
దాదాపు 60 రోజుల పాటు రైతుల మహాపాదయాత్ర కొనసాగనుంది. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ సాగనున్న యాత్ర సుమారు 90 కిలీమీటర్ల మేర సాగనుంది. పాత గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం మీదుగా శ్రీకాకుళం ఈ యాత్ర చేరుకోనుంది.
Next Story

