Thu Mar 19 2026 00:16:35 GMT+0530 (India Standard Time)
Breaking : కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ
ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు

కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఏపీలో 58 అసెంబ్లీ స్థానాలు ఎనిమిది లోక్్సభ స్థానాలకు మినహా అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. మిగిలిన చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ఈరోజు అధికారికంగా పార్టీ ప్రకటించనుంది. ఎన్నికల కమిటీ ఖరారు చేసిన పేర్లు బయటకు వచ్చాయి.
కడప -షర్మిల
రాజమండ్రి - గిడుగు రుద్రరాజు
కాకినాడ - పల్లంరాజు
బాపట్ల - జేడీ శీలం
విశాఖ - సత్యారెడ్డి
తిరుపతి - చింతామోహన్
ఏలూరు - లావణ్య
రాజంపేట - నజీర్ అహ్మద్
చిత్తూరు - చిట్టిబాబు
హిందూపురం - షాహీన్
Next Story

