Sun Mar 15 2026 08:54:39 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ కేబినెట్ భేటీ : కీలకనిర్ణయాలు
మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు...
కడప సున్నపురాళ్ల పల్లెలో జెఎస్ డబ్ల్యూ స్టీల్స్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం సుముఖత వ్యక్తం చేయనుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల గురించి కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. దీంతో పాటు వివిధ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించనుంది.
Next Story

