Thu Mar 19 2026 07:22:29 GMT+0530 (India Standard Time)
రేపు మంత్రుల రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 11వ తేదీన జరగనుంది. రేపు సాయంత్రం ప్రస్తుత మంత్రివర్గం చివరి సమావేశం జరగనుంది

ఆంధ్రప్రదేశ్ లో మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 11వ తేదీన జరగనుంది. రేపు సాయంత్రం ప్రస్తుత మంత్రివర్గం చివరి సమావేశం జరగనుంది. మంత్రి వర్గ సమావేశం అనంతరం మంత్రులు తమ రాజీనామా లేఖలను జగన్ కు సమర్పించనున్నారు. అయితే మంత్రుల రాజీనామా లేఖలను గవర్నర్ కు పంపనున్నారు. ఈనెల 8వ తేదీన గవర్నర్ మంత్రుల రాజీనామాలను ఆమోదించే అవకాశముంది.
11న కొత్త మంత్రుల చేత....
అదే సమయంలో ఈ నెల 8వ తేదీన కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు జగన్ పంపనున్నారు. ఈ నెల 11వ తేదీ 11.30 గంటలకు కొత్త మంత్రుల చేత గవర్నర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకే కొద్దిసేపటి క్రితమే జగన్ రాజ్ భనవ్ కు వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. మంత్రి వర్గ సభ్యుల ప్రమాణస్వీకారానికి గవర్నర్ అపాయింట్ మెంట్ ను జగన్ కోరనున్నారు.
Next Story

